Saturday, 13 June 2026 02:12:35 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహానీయుడు అంబేద్కర్...

Date : 14 November 2022 11:30 PM Views : 431

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా బడుగు, బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో, వారికి కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ... -అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారతజాతి చేసుకున్న అదృష్టం. -అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా వేల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలు... -దళిత సాధికారత కోసం, డా. బి. ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధన లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం. దళితుల అభ్యున్నతికి దేశంలోనే ఎక్కడాలేని విధంగా, దళితబంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని నూటికి నూరు శాతం సబ్సిడీ కింద ఆర్థిక సహాయం ... -బడుగు బలహీనర్గాల వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు చదువే శక్తివంతమైన ఆయుధమని భావించిన ప్రభుత్వం అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల విద్య కోసం కోట్లాది రూపాయలను . -అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన గురుకులాలు విజయవంతంగా నడుస్తున్నాయి... -అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల్లో అర్హులైన వారికి 20 లక్షల రూపాయలను స్కాలర్ షిప్ గా అందిస్తూ, వారి కలలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తుంది. -అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్. అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహానీయుడు అంబేద్కర్ అని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ కొనియాడారు.సోమవారం కొండమల్లెపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా బడుగు, బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో, వారికి కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన అన్నారు.అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారతజాతి చేసుకున్న అదృష్టం అని ఆయన అన్నారు.అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా వేల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుంది అని ఆయన అన్నారు.దళిత సాధికారత కోసం, డా. బి. ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధన లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి దేశంలోనే ఎక్కడాలేని విధంగా, దళితబంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని నూటికి నూరు శాతం సబ్సిడీ కింద ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది అని ఆయన అన్నారు.బడుగు బలహీనర్గాల వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు చదువే శక్తివంతమైన ఆయుధమని భావించిన ప్రభుత్వం అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల విద్య కోసం కోట్లాది రూపాయలను అందిస్తుంది అని ఆయన అన్నారు.అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన గురుకులాలు విజయ వంతంగా నడుస్తున్నాయి అని ఆయన తెలిపారు.అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల్లో అర్హులైన వారికి 20 లక్షల రూపాయలను స్కాలర్ షిప్ గా అందిస్తూ, వారి కలలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తుంది అని ఆయన అన్నారు.ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న కార్యక్రమాలతో వారి జీవనప్రమాణాలు మెరుగై, ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ,మార్కెట్ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, ఎంపీపీ దూదిపాల రేఖా రెడ్డి,జడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగేందర్ రెడ్డి,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,రైతు బంధు అధ్యక్షుడు కేసాని లింగా రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దాస్రు నాయక్,PACS చైర్మన్ దూదిపాల వేణుదర్ రెడ్డి,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాడిత్య దేవేందర్,మాడుగుల యాదగిరి,టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు,నియోజకవర్గ అధ్యక్షుడు బోడ్డుపల్లి కృష్ణ,స్థానిక సర్పంచు రుద్రమ్మ,హరిక్రిష్ణ,రాజారావు,శ్రీరాములు,తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :