సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట డి కుమార్ రిపోర్టర్ మంగళవారం ఎనమాముల మార్కెట్ ను సందర్శించనున్న మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధ విధానాల వలన పత్తి రైతులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారూ . యూరియా కొరతతో పత్తి దిగుబడి తగ్గడంతో పాటు ఇటీవల వచ్చిన మే0ధా తుఫాన్ తో పత్తి రైతులు తీవ్ర నష్టపోవడం జరిగింది వారికి వచ్చిన కొద్ది పాటి పత్తిని కూడా ఈరోజు మార్కెట్లో అమ్ముకోలేని దయనీయమైన దుస్థితి నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఏర్పడింది.. సీసీఐ లోప భూయిష్టమైన విధానాల వలన జిన్నింగ్ మిల్లులో సమ్మె చేస్తున్నారు దీనితో రైతులు పత్తిని అమ్ముకోలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు పత్తి కొనుగోలులో తేమశాతం పెరుగుతుందని రైతుల ఆందోళన చెందుతున్నారు 18/11/2025 ఉదయం 9 గంటలకు ఏనుమాముల పత్తి మార్కెట్ యార్డ్ ని సందర్శించి సీసీఐ పత్తి కొనుగోలు ప్రక్రియను పరిశీలించి అనంతరం రైతులతో మాట్లాడనున్న మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు ,మాజీ ఎమ్మెల్యేలు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మండల మరియు రైతులు, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం ేయాలని బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు
-----------------------
Reporter