సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజార ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం లో మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ఆరోగ్య మహిళ పథకన్ని ప్రారంభించటం జరిగింది, ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ తెలంగాణ మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలని మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి చూపుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది అని తెలియజేశారు, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మహిళా సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నారు, మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు ప్రతి గురువారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు. PHC,UPHC,బస్తీ దవాఖానల్లో నిర్వహణ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు , ఇది మహిళా దినోత్సవ కానుకగా మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు తొలుత 100 కేంద్రాల్లో.. తర్వాత 1200 కేంద్రాలకు విస్తరణ.. 8 రకాల పరీక్షలు ఇవే.. 1. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు చేస్తారు. 2. ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్ నిర్వహిస్తారు. 3. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతోపాటు విటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు. 4. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు. 5. మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి హార్మోన్ రీప్లే స్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 6. నెలసరి, సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి, వైద్యంతోపాటు అవగాహన కల్పిస్తారు. అవసరమైనవారికి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు. 7. సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి, అవగాహన కల్పిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు. 8. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామంపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో మొరంపల్లి బంజార ఆరోగ్యశాఖ అధికారి Dr,స్పందన , ఆరోగ్య శాఖ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు,
-----------------------
Admin