Thursday, 30 July 2026 01:33:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టీ ఎన్ జీ ఓ ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ...

Date : 29 September 2022 10:30 PM Views : 396

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : టీ ఎన్ జీ ఓ ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న జెడ్పి చైర్మన్, కలెక్టర్ .... బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గురువారం టీ ఎన్ జీ ఓ ల సంఘం ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, మహిళా కమిషన్ సభ్యురాలు సుదాం లక్ష్మీ, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని కోలాటం ఆడుతూ మహిళలను ఉత్సాహపర్చారు. ముందుగా రంగురంగుల పూలతో ఆకట్టుకునే రీతిలో ముస్తాబు చేసిన బతుకమ్మలకు జెడ్పి చైర్మన్, కలెక్టర్ తదితరులు సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ సంబరాల్లో తాము కూడా స్వయంగా భాగస్వాములవుతూ కోలాటం ఆడారు. నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు తమ ఆటపాటలతో అందరిలో హుషారు నింపారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు కనువిందు చేస్తూ పూల పండుగ ప్రాధాన్యతను చాటాయి. బతుకమ్మ గేయాలను ఆలపిస్తూ యువతులు, మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆటలాడుతూ ఎంతో ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయ పనివేళలు ముగిసినప్పటికీ ఉద్యోగినులు ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా ఎంతో హుషారుగా ఈ ఉత్సవంలో పాల్గొని బతుకమ్మ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. దాదాపు మూడు గంటలకు పైగా విరామం లేకుండా సాగిన ఈ సంబరాల్లో అలుపెరుగకుండా మహిళలు బతుకమ్మ గేయాలను ఆలపిస్తూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్టోబర్ 3వ తేదీ వరకు కొనసాగనున్న బతుకమ్మ వేడుకలను ఇదే రీతిలో మరింత పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం పట్ల ప్రతినిధులను అభినందించారు. ఈ ఉత్సవాల్లో టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అలుక కిషన్, అమృత్ కుమార్, శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, డీ ఎం హెచ్ ఓ సుదర్శనం, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, డీ ఎస్ సి డీ ఓ శశికళ, డీడబ్ల్యుఓ సౌందర్య, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :