సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తొమ్మిదో విడత హరితహారం లో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు మఠంపల్లి మండలంలో ఎంపీపీ మూడవత్ పార్వతీ కొండా నాయక్ హాజరైన బక్కమంతుల గూడెం, చౌటపల్లి,మఠంపల్లి ,పెదవీడు గ్రామపంచాయతీలలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. భావితరాలకు మంచి వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ముఖ్యంగా మొక్కల సంరక్షణ బాధ్యతను గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తీసుకోవాలని కోరారు. చిన్న మొక్కను మనం బ్రతికి స్తే, అవి పెద్ద చెట్లై మనల్ని బ్రతికిస్తాయి . మొక్కలు పెంచడం ద్వారా పచ్చదనం పెరుగుతుందని మంచి హాహ్లాద మైన వాతావరణ కలుగుతుంది .మొక్కలు పెంచడం ద్వారా సకాలనికి వర్షాలు కురుస్తాయని, తద్వారా పంటలు బాగా పండుతాయని అన్నారు మొక్కలు నాటడం వలన పర్యావరణ కాలుష్యము కాకుండా చేస్తాయని, వాతావరణం లోని కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయని, తద్వారా వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరిగి, మానవుల మనుగడకు, అవసరమైన ఆక్సిజన్ ను చెట్లు అందజేస్తాయి అందుకే మన మంతా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుదాం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జానకి రాములు, ఎంపీ ఓ ఆంజనేయులు, ఏపీవో ఉమా, బక్కమంతుల గూడెం సర్పంచ్ బేత విజయకుమార్ వెంకటరెడ్డి, పెదవీడు సర్పంచ్ బీబీ కుతుబ్, టెక్నికల్ అసిస్టెంట్ లు, బుంగయ్య, మల్సూర్ ఫీల్డ్ అసిస్టెంట్ బిచ్చు నాయక్ లు కార్యదర్శులు లక్ష్మణ్ ,వెంకటేశ్వర్లు ,ఉపాధి హామీ సిబ్బంది, మేట్లు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin