Friday, 31 July 2026 06:48:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణలో పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శం...

Date : 16 June 2023 03:15 AM Views : 445

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల లో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కెసిఆర్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.తెలంగాణ రాక ముందు గ్రామాలు ఎట్లా ఉండే? తెలంగాణ వచ్చాక గ్రామాలు ఎట్లా ఉన్నాయో ప్రజలందరూ గమనించాలని అన్నారు.తెలంగాణ లో భూముల విలువలు పెంచిన ఘనత సీఎం కెసిఆర్ గారిది అని అన్నారు.గ్రామాల అభివృద్ధియే.. దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించి,పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టి గ్రామాల పరిశుభ్రత, స్వచ్ఛతే లక్ష్యంగా దశలవారీగా పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలు పేరుకుపోయిన చెత్తా చెదారం, మురుగు కాల్వలను శుభ్రపరచడం, పరిసరాలను పరిశుభ్రత, ఎవెన్యూ ప్లాంటేషన్‌, నర్సరీ, డంపింగ్‌యార్డుల్లో పిచ్చి మొక్కలు తొలగింపు, వైకుంఠధామాల నిర్మాణం వంటి కార్యక్రమాలతో నేడు పల్లెలు పరిశుభ్రతతో కనిపిస్తున్నవి అని ఆయన అన్నారు. బేతవోలు అభివృద్ధికి కార్యక్రమం కింద మొత్తం 10 కోట్లను ఖర్చు చేసి గ్రామాలను అభివృద్ది చేశాం అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా ప్రకటించబడిన ఒకే ఒక మన రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. సమగ్ర గ్రామీణ అభివృద్ధికై నూతన పంచాయతీ రాజ్ చట్టం అమలు చేస్తున్నాం అని అన్నారు.ప్రతి గ్రామపంచాయతీకి పంచాయతీ కార్యదర్శిని నియమించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్, ట్యాంకరు, ట్రాలీ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీ, పల్లె ప్రకృతివనము, ఏవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.ప్రతి ఇంటికి నల్లా ద్వారా శుద్ధిచేసిన మంచి నీటిని సరఫరా చేస్తున్న దేశంలోనే ప్రథమ రాష్ట్రం తెలంగాణ ఆయన అన్నారు.ఇవ్వాళ పల్లెల్లో పల్లె ప్రగతి పండుగ జరుగుతున్నదని అన్నారు.చెడును మంచిగా మార్చే విధంగా చెత్తను ఎరువుగా మార్చే ఏర్పాట్లు జరిగాయి అని తెలిపారు. అనంతరం పంచాయతీ సిబ్బందిని ఎమ్మెల్యే సత్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వట్టికూటి చంద్రకళ నాగయ్య, రైతు సమన్వయ సమితి నాయకులు బజ్జూరు వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ తాళ్లూరు శ్రీనివాస్, సొసైటీ వైస్ చైర్మన్ అక్కెనపల్లి జానకి రామాచారి,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ సురేష్ బాబు, సొసైటీ చైర్మన్లు జనార్ధన్, సైదులు, మాజీ జెడ్పిటిసి శివాజీ నాయక్,మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కొవ్వూరు వెంకటేశ్వర్లు, బెల్లంకొండ నాగయ్య, తాసిల్దార్ రాజేశ్వరి,ఎంపీడీవో ఈదయ, ఎంపీటీసీలు ధనమూర్తి, సైదా బాబు, బిఆర్ఎస్ నాయకులు అశోక్, యాగ్గడి రామారావు, గ్రామ పాలకవర్గ సభ్యులు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: