Thursday, 30 July 2026 04:21:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు...

Date : 05 November 2024 05:23 PM Views : 436

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాదులో కొన్ని గంటలు ఆయన గడపనున్నారు. మియాపూర్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో బావర్చీ హోటల్ వద్దకు రండి.. బిర్యానీ తిందామంటూ కొంతమంది విద్యార్థులు.. రాహుల్ గాంధీను ఆహ్వానిస్తున్నారు. బావర్చీ బిర్యానీ ఎంత ఫేమస్ అందరికీ తెలుసు.. మరోవైపు రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు హైదరాబాద్ పర్యటనల్లో ఆయన పారడైజ్ బిర్యానీ తిన్నారు. కానీ ఇప్పుడు ఈ విద్యార్థులు పిలుస్తున్న ఆహ్వానం వేరేది.. గత ఏడాది ఇదే సమయంలో ఎన్నికలకు ముందు హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ అశోక్ నగర్ లో ఉన్న నిరుద్యోగులను కలుసుకున్నారు. అక్కడ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆయనే చాయ్ తాగించారు. విద్యార్థులతో అశోక్ నగర్ లో భేటీ అయిన రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. అదే అశోక్ నగర్ కి ఆనుకుని ఉన్న బావర్చీ బిర్యానీ హోటల్ లో బిర్యానీ తింటూ ఉద్యోగాల సంగతి మాట్లాడుకుందాం.. అంటూ ఇప్పుడు అక్కడి స్టూడెంట్ సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు బావర్చీ దగ్గర వెయిట్ చేస్తున్నామంటూ ఒక కుర్చీకి రాహుల్ గాంధీ ఫోటోను తగిలించి.. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సాయంత్రం రాహుల్ గాంధీ రాక సందర్భంగా చాలామంది విద్యార్థులు బావర్చీ దగ్గర వెయిట్ చేస్తామంటున్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :