Thursday, 30 July 2026 04:02:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెండింగ్ స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి...

Date : 22 August 2023 06:15 AM Views : 316

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ మరియు సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ఛలో కలెక్టరేట్ నిర్వహించారు. కెఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల మైదానం నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లి కలెక్టరేట్ గేట్ ఎదుట భైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) రవీంద్రనాథ్ కు మెమొరాండం అందజేశారు. కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 5177 కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని,మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, మధ్యాహ్న భోజనానికి అధిక నిధులు కేటాయించాలని, ప్రభుత్వ బడులన్నింటినీ మన ఊరు- మనబడి పథకం కింద చేర్చి త్వరితగతిన అభివృద్ధి చేయాలని, కేజీబీవీ లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని,సకాలంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించాలని టెండర్లు వేసి తగు పద్ధతిలో విద్యార్థులకు అవసరమైన నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18,000 ఉపాధ్యాయ పోస్టులను చేయాలని, ఉన్నత విద్యారంగంలో ఖాళీగా ఉన్న 12వేల అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని,పాలక ప్రభుత్వాల నిర్ణయాల వల్లనే నేడు తెలంగాణలో విద్యారంగం సంక్షోభంలో ఉందని అన్నారు. ప్రభుత్వ విద్యా రంగంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ,డిఈఓ,డిప్యూటీ డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ కార్మికులు నియమించాలని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించాలని, ప్రభుత్వ యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు ఆయా యూనివర్సిటీలకు అవసరమైన బడ్జెట్ కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులకు నెలవారి ఫెలోషిప్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్, జిల్లా ఉపాధ్యక్షులు భయ్యా అభిమన్యు, అభిమిత్ర, నాగకృష్ణ, కేశ సందీప్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తానం వంశీ, రామ్ చరణ్, పట్టణ నాయకురాలు భవ్య అనిల్, శ్రవణ్, శివమణి తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శనలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: