Saturday, 01 August 2026 12:37:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కులం లేదు మతం లేదు ప్రజలంతా ఒకటే సేవే నా కులం, సేవే నా మతం... - పిల్లుట్ల రఘు

Date : 18 November 2023 11:09 AM Views : 195

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్నగర్ పట్టణంలో ముస్లిం పెద్దల ఆహ్వానం మేరకు ఎఐఎఫ్ బి పార్టీ సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి మసీదును సందర్శించారు. ముస్లిం పెద్దలు ఇటువంటి సేవ భావాలు ఉన్న స్థానికుడు, నిస్వార్థ, సేవకుడు ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకా గొప్ప సేవ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు గొప్ప చేయించుకోవచ్చు అని అన్నారు.. గతంలో మసీదులకు పీర్ల చావడిలకు అధికారంలో ఉన్న నాయకులు పట్టించుకోకపోయినా సొంత ఖర్చులతో రంజాన్ బక్రీద్ పండుగలకు ఇఫ్తార్ విందులతో, పెదముస్లిం ప్రజలకు ఆర్థిక సహాయ సహకారాలు అందించిన రఘుని ఆదరిస్తామన్నారు. అందుకే ఇటువంటి గొప్ప నాయకుడిని సింహం గుర్తుపై ఓటు వేసి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం పెద్దలు తనపై చూపుతున్న అభిమానాన్ని చూసి చాలా సంతోషంగా ఉందని మీ దీవెనలతో తప్పకుండా ఎమ్మెల్యే గెలుపు తనదే అన్నారు. గడిచిన సంవత్సరాల కాలంలో నియోజవర్గంలో ప్రజలకు, క్రైస్తవులు, ముస్లింలు, బీసీలు ఓసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు,బహుజనులు అందరికీ కులం,మతం, చిన్న పెద్ద తేడా లేకుండా విద్యా వైద్య, ఆర్థికంగా, నిరుద్యోగులను ఉచిత కోచింగ్లతో ఆదుకుంటూ, మసీదులు , చర్చిలు , దేవాలయాలు, పాఠశాలలు ఆధునికరించానని, తాగునీటి కోసం అనేక బోర్లను సొంతంగా వేయించానని, ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేశానని అన్ని కులాల వారిని మతాల వారిని ఆదరించానని అన్నారు. నియోజవర్గంలో ప్రజా సేవలు నావి, అధికార హోదాతో ధనార్జన ధ్యేయంగా పనిచేసిన కొంతమంది నాయకులు, ప్రజా ఓట్లను దుర్వినియోగం చేసి, కాలంక్షేపం చేసి ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చేసరికి మన ఇంటికి వచ్చి ఓట్లు అడగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉన్నారు.ఇటువంటి మోసపూరిత నాయకులను ప్రజలు నమ్మవద్దని,కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో లేకుంటే చేయడమే మన లక్ష్యమని, ప్రజలందరూ సింహం గుర్తుపై ఓటేసి తన ఎమ్మెల్యే గెలుపుకు భాగస్వాములు కావాలన్నారు. కొంతమంది నాయకులు తన సహాయ సహకారాలు పొంది, తనను ఆదరిస్తామని చెప్పి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ వెంట తిరుగుతున్నారని, బానిసలుగా మారి వారి కోసం పనిచేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా లేక రాచరిక పాలనలో బతుకుతున్నామా అని అన్నారు. ఇటువంటి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల రాచరిక పాలనను అంతం చేసి సింహం గుర్తు ఎమ్మెల్యే గెలిచి ప్రజల్లో గొప్ప చైతన్యం తీసుకువచ్చి నియోజకవర్గం భవిష్యత్తును మారుస్తానని పిల్లుట్ల రఘు అన్నారు.. కనీసం తాగునీటి వసతిని, మెయిన్ రోడ్లను కూడా పట్టించుకోని అవినీతి నాయకులును నియోజవర్గం నుంచి పంపించివేసి ప్రజలకు స్వచ్ఛమైన ప్రజాపాలనను అందిస్తానని పిల్లుట్ల రఘు అన్నారు.. తనలాంటి నాయకుడు మళ్ళీ నియోజకవర్గానికి దొరకడని ప్రజలు మంచివారిని ఆదరించి సింహం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని రఘు అన్నారు.. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, యువకులు, సింహం గుర్తు కార్యకర్తలు, రఘు అన్న అభిమానులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: