సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : మోపాల్ మండలంలోని రైతు వేదిక వద్ద నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి రైతులతో ప్రజాప్రతినిధులతో రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న వ్యాఖ్యలపై రైతు వేదిక వద్ద నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ మరియు జిల్లా యువ నాయకులు జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు ధర్పల్లి జెడ్పిటిసి శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ 40 ఏళ్ల నుంచి రాజకీయం లో ఉన్న రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలు పెంచడం జరిగింది అప్పుడు డిప్యూటీ స్పీకర్ కేసీఆర్ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని ఆరోజే ఆయన అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి అప్పుడు బుద్ధి చెప్పి రైతులు, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చాన విషయం గుర్తు చేశారు. తెలంగాణ రాకున్న ముందు కరెంటు కష్టాలు వర్ణన తీరం రైతులు వ్యవసాయం సాగు చేయాలంటే అనేక ఇబ్బందులు ఉండే, బోరు మోటర్ కాలిపోవడం, ట్రాన్స్ఫర్లు కాలిపోవడం, రైతులు పంటలు పండగ బోరు మోటార్ల కు బిల్లు కట్టకుంటే బోరు మోటర్ పీకేల్లడం రైతులపై కేసులు పెట్టడం గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టిడిపి ప్రభుత్వం గానీ, నాణ్యత కరెంటు ఇచ్చిన దాఖలు లేవు, లో వోల్టేజ్ ఇవ్వడం, రైతులు అప్పట్లో కరెంటు లేక రాత్రింబవళ్లు వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లి పాముకాటుకు గాని విద్యుత్ ఘాతానికి గురై ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయారు, కానీ ఇప్పుడు మారింది తెలంగాణ వచ్చిన తర్వాత, వ్యవసాయమే దండగన్న.. ఇప్పుడు వ్యవసాయమే పండగ మార్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం 24 గంటలు ఉచిత కరెంటు, రైతుబంధు రైతు బీమా ఇస్తున్న ప్రభుత్వం ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇదే కాకుండా కళ్యాణ లక్ష్మి, ఫెంచన్ , ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర. కానీ కొంతమంది బీజేపీ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలను పక్క తోవ మళ్లించాలని, అబద్ధప్రచాలు చేయడం, మత రాజకీయాలు చేయడం చేస్తున్నారు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు, మాకు ఎక్కడ పుట్టగతులు ఉండవు అని కాంగ్రెస్ భయం, కాంగ్రెస్ ఉనికి చాటుకోవాలని ఇలా రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. రేవంత్ రెడ్డి ఒక దొంగ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణకు అవడం దురాడుస్త కరం..కులమతాలో చిచ్చులు పెట్టేందుకే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు బిజెపి ప్రభుత్వం మతాల పరంగా మాట్లాడం తప్ప పనిచేయడం తెలియదు మహారాష్ట్రలో బీ ఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ బీసీ ఎస్టి మైనార్టీలను ఆదుకున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రానికి అనేక నిధులు సమకూర్చుకోవచ్చు అని ఆయన అన్నారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో పెన్షన్ 4000 పెంచి మాట్లాడాలి, కానీ ఇప్పుడు అధికారం కోసం 4000 ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు, అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముందు ఇప్పించి తర్వాత మాట్లాడండి అని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకులు జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ , వివిధ మండలాలకు చెందిన, ఎంపీపీలు, జడ్పిటిసిలు, సొసైటీ చైర్మన్లు సొసైటీ డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin