Saturday, 01 August 2026 02:54:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు విధించిన స్టే కు నిరసనగా నర్సంపేటలో రాస్తారోకో ధర్నా*

Date : 10 October 2025 10:07 PM Views : 247

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : *అగ్రవర్ణాల నాయకుల కుట్రలో భాగమే హైకోర్టు స్టే* *రాస్తారోకో ధర్నా చేస్తున్న బీసీ నాయకులను పోలీసులు అరెస్ట్ వ* తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజిస్ట్రేషన్ల పై హైకోర్టు విధించిన స్టే ను నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం వరంగల్ రోడ్ లో ఉన్న నర్సంపేట పట్టణంలోని తెలంగాణ అమరవీరుల జంక్షన్ లో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు బీసీ రిజిస్ట్రేషన్ల పై స్టే విధించడం అగ్ర కులాల నాయకుల కుట్రలో భాగమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల బిల్లును అన్ని రాజకీయ పార్టీలతో అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును గవర్నర్ కు పంపి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసే విధంగా బిల్లును కేంద్రానికి పంపడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును పార్లమెంటులో చర్చించకుండా నిర్లక్ష్యం చేయడం జరిగిందనిఅన్నారు. స్థానిక సంస్థల 42 శాతం రిజర్వేషన్ల జీవో 9ను రద్దు చేయాలని రెడ్డి జాగృతి నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం బీసీ రిజిస్ట్రేషన్లకు వ్యతిరేక కుట్ర జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులాల వారిగా కులగణన చేపట్టి బీసీల జనాభా 56 శాతానికి పైగా ఉందని చట్టబద్ధంగా తేల్చిన అగ్ర కులాల నాయకుల చొరవతో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రెడ్డి జాగృతి పేరుతో ద్రోహులు హైకోర్టు లో పిటిషన్ వేసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అగ్ర కులాల జనాభా 6 శాతం కూడా లేకున్నా ఈడబ్ల్యూఎస్ తో 10 శాతం రిజర్వేషన్లు ఏలా అమలుచేయటం జరుగిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకులు పార్టీలకు అతీతంగా పోరాడాలని సూచించారు. అదే విధంగా బీసీ కులాలకు చెందిన వారు పార్టీ జెండాలను పక్కన పెట్టి బీసీ రిజర్వేషన్లను సాధించే వరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐకమత్యంతో పోరాటం చేసి రిజర్వేషన్లను సాధించుకోవాలని డ్యాగల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు బీసీల ఓట్లు కావాలంటే బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు తెలపడంతో సరిపోదని బయట కూడా మద్దతు తెలిపితే పార్టీలకు మనగడ ఉంటుందని హెచ్చరించారు. ఇది ఆరంభం మాత్రమే భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు ఆయా పార్టీల్లో ఉన్న బీసీ లు పార్టీ జెండాలను పక్కన పెట్టి పోరాడాలని అన్నారు. రాస్తారోకో ధర్నా చేస్తున్న బీసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రబోయిన రమేష్ ముదిరాజ్ జిల్లా అధికార ప్రతినిధి మరుపల వీరస్వామి కురుమ, జిల్లా సహాయ కార్యదర్శి మట్ట రమేష్ యాదవ్, బీసీ జిల్లా నాయకులు డ్యాగం శివాజీ, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ కార్యదర్శిలు గాండ్ల శ్రీనివాస్, భేతి భాస్కర్, పట్టణ యూత్ అధ్యక్షుడు గోపగాని నాగరాజ్ గౌడ్, దుగ్గొండి మండల అధ్యక్షుడు పొన్నాల మహిపాల్, ఉపాధ్యక్షుడు చొప్పరి భాస్కర్ ముదిరాజ్, యూత్ మండల అధ్యక్షుడు బండారి ఉదయ్ కిరణ్, చెన్నారావుపేట మండల అధ్యక్షులు బర్ల యాకయ్య, మండల మహిళా అధ్యక్షురాలు బండి విజయ, కార్యదర్శి చామంతుల రమేష్ ముదిరాజ్, చెన్నారావుపేట టౌన్ మహిళా అధ్యక్షురాలు ముంజ లక్ష్మి, మహిళా ప్రధాన కార్యదర్శి కారుపోతుల శ్రీదేవి మహిళా నాయకురాలు వైనాల రజిత, గొర్రె వినయ్ ముదిరాజ్ శ్రీకాంత్, ల్యాగల ప్రవీణ్ కుమార్, సింగనబోయిన నవీన్ లతో పాటు బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: