సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పరిశ్రమల సహాయ సహకారాలతో ప్రజా వైద్యశాల నెలకొల్పుట గురించి భూమి సేకరణ చేయాలని ఆర్డీవో కి వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు మఠంపల్లి మండలంలోని పరిశ్రమల సహాయ సహకారంతో ప్రజా వైద్యశాల నెలకొల్పుటకు అవసరమైన భూమిని మండలంలోని మఠంపల్లి గ్రామం మరియు పెదవీడు రెవెన్యూ పరిధిలో సుమారు 5 ఎకరాల భూమి కేటాయించాలని హుజూర్ నగర్ ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, గంగసాని ఎల్లారెడ్డి ,కరీం , చిలక కిషోర్ , ఆదినారాయణ రెడ్డి ,శ్రీనివాస్, రవి , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin