Friday, 31 July 2026 02:27:08 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణలో బిజెపి ప్రభుత్వం తద్యం... - చల్లా శ్రీలత రెడ్డి

Date : 07 November 2023 07:17 AM Views : 293

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రంలో నేరేడుచర్ల పట్టణం,పాల కీడు మండలానికి చెందిన వివిధ పార్టీల 50మంది యువకులు శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. వారికి బిజెపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్తారు అని తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని హుజూర్ నగర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా శ్రీలత రెడ్డి అన్నారు.రాష్ట్రంలో యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కేసీఆర్ ప్రభుత్వం తాత్సారం చేసిందని ఆరోపించారు. టీఎస్పీ ఎస్సీ ద్వారా గ్రూప్స్ నోటిఫికేషన్లు వేసి పేపర్ లీకేజీ చేసినా ఘనత తెలంగాణ ప్రభుత్వానికి చెల్లిందని ఎద్దేవ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ముద్ర లోన్స్, అనేక యువజన పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్న నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు భారత్ దేశం అంటే ప్రపంచంలో గుర్తింపు లేదని, నరేంద్ర మోడీ తో ప్రపంచ దేశాలు సైతం భారతదేశ వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ ఘనత బిజెపి పాలనలో నరేంద్ర మోడీ తోనే సాధ్యమైందని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం,దేశ జాతీయతా భావాల్ని యువత పెంపొందించు కొని బిజెపి పార్టీతో కలిసి నడవాలని కోరారు. ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నా కూడా యువతకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించడంలో కూడా ఈ ప్రభుత్వాలు విఫలం చెందాయని అన్నారు.రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కచ్చితంగా బిజెపి జెండా ఎగురు తుందని ధీమా వ్యక్తం చేశారు.బిజెపిలో చేరిన వారిలో పాల కీడు మండలం యువకులు శ్రీనివాస్ రెడ్డి, వంశీ, శ్రీను, శివ, నాగర్జున, నేరేడు చర్ల పట్టణానికి చెందిన యువకులు గణేష్, మహేష్, యాకూబ్, సుధీర్ , సంతోష్ , వెంకట్, హుస్సేన్, గంగారెడ్డి లతో పాటు మరో 30 మంది యువకులు ఉన్నారు.ఈ కార్య క్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బాల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొనతం నాగిరెడ్డి, సీనియర్ నాయకులు తాళ్లూరి రమేష్, యు. రామ్మూర్తి, శంకర్ రెడ్డి, నాగేశ్వర్ రావు, శ్రీకాంత్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: