Thursday, 30 July 2026 01:42:38 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నిరుపేద విద్యార్థుల చదువుల కోసం ఉచిత బస్సు పాసులు...

Date : 10 August 2023 08:33 AM Views : 482

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ తరఫున తన శక్తివంచన లేకుండా ఉచిత ప్రయాణం కోసం బస్ పాసులు జారీ చేస్తున్నట్టు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా 15 వేల మంది విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేలా కాంగ్రెస్ పాసులను పంపిణీ చేశారు. అదేవిధంగా నియోజక వర్గంలో 4500 మంది వికలాంగులకు కూడా ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించడం విశేషం. ఈ సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని బ్రిలియంట్ గ్లామర్ హై స్కూల్ విద్యార్థులకు 500 మందికి పాసులను పంపిణీ చేయడం విశేషం. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తన శక్తివంచన మేరకు విద్యార్థులకు ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో బస్సు పాసులను కేటాయిస్తుందని అదేవిధంగా విద్యార్థుల ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా పాసులను అందజేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు తెలంగాణ ఆర్టీసీ సంస్థకు కూడా ఆర్థిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, పిసిసి మెంబర్ బాబర్ ఖాన్, ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి రఘు, ఫరూక్ నగర్ మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందేమోహన్, ఫరూక్ నగర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, షంషీర్ ఖాన్, శబద్దీన్, నల్ల ముని శ్రీధర్, మండల ప్రధాన కార్యదర్శి తుపాకుల శేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ జితేందర్ రెడ్డి, రాయికల్ శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు నాగమణి, ఎస్టీ సెల్ తాలూకా అధ్యక్షులు శీను నాయక్,యూత్ కాంగ్రెస్ తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ ఖదీర్, బ్యాటరీ కృష్ణారెడ్డి, ముబారక్, మైనార్టీ సెల్ హలీం సాకీబ్, గణేష్ నాయక్, గోపాల్ నాయక్, అజ్మత్ బాబా, అందె శ్రీకాంత్, రాజు గంగ ముని సత్తయ్య, పద్మారం వెంకటేష్, నాయక్,ప్రవీణ్, మాధవులు, శ్రీధర్ గౌడ్, సురేష్ గౌడ్, గణేష్ యాదవ్, లింగారెడ్డి గూడా అశోక్, దేవగిరి నవీన్, నెహ్రు నాయక్, రాజు, చెన్నప్ప, రానా ప్రతాప్, హైదర్గూరి, ఆసిఫ్ గోరి, ఫయాజ్, అన్వర్, హజ్మత్, జఫర్ ఖాన్, శీను, గోపి, మల్లేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: