సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల వార్త విలేఖరి, సీనియర్ జర్నలిస్ట్ పానుగంటి కృష్ణయ్య మంగళవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టి డబ్ల్యూ జే ఏ ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ, గ్రామీణ విలేకరుల సంఘం రాష్ట్ర నాయకులు దొంతి రెడ్డి కరుణాకర్ రెడ్డి, టి ఎన్ స్వామి తదితరులు మృతుడి స్వగ్రామం పెంచికల్ దిన్నే గ్రామంలో మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఇంకా సంతాపం వ్యక్తం చేసినవారిలో జర్నలిస్టులు గోపాలకృష్ణ, రాజు, నాగుల్ మీరా, ప్రతాప్ సతీష్, బుడిగ శంకర్, చామకూరి వీరయ్య, బోళ్ల సుధాకర్, కొంపల్లి కృష్ణారావు, వనపర్తి శ్రీనివాస్, రాగిరెడ్డి నర్సిరెడ్డి, కొంజేటి ప్రభాకర్ రావు, దొంత రెడ్డి వెంకటరమణారెడ్డి తదితరులున్నారు...
-----------------------
Admin