సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని తుమ్మల తండా గ్రామానికి చెందిన గుగులోత్ కళావతి భర్త బాబు మఠంపల్లి నుండి హుజూర్ నగర్ కు బైక్ పై వెళుతుండగా ఎర్రగట్టు వద్దకు రాగానే ఎదురుగా కుక్క అడ్డం వచ్చిందని దానిని తప్పించే ప్రయత్నంలో కింద పడిపోయారని వెనక కూర్చున్న కళావతి తలకు బలమైన గాయాలు కారణంగా అక్కడికక్కడే మరణించింది భర్తకు స్వల్ప గాయాలు తగిలాయి. కళావతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-----------------------
Admin