సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మండలాలలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తాం. నన్ను గుండెల్లో పెట్టుకున్న అభిమానులు నేనున్నా అని చెప్పారు నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు అని తెలిపారు అధికారం ఎవరు సొత్తు కాదు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనదే విజయం అన్నారు ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, తుళ్లూరి బ్రహ్మయ్య, బెజ్జం వెంకటేశ్వర్ రెడ్డి, నాగిరెడ్డి, ఎడమ కంటి పెద్దరోసి రెడ్డి, , మరియు పొంగులేటి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...
-----------------------
Admin