సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : పేద మైనారిటీ మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషీ చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ లో ‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కే లియే భరోసా’ పథకంలో తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పథకం కింద ‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కే లియే భరోసా’ అనీ నిరుద్యోగ మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లన పంపిణీ చేశారు. ఈ పథకంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్, చౌదరిగూడ, నందిగామ, ఫరూఖ్ నగర్ మండలాల్లోని ప్రజలకు 'కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కే లియే భరోసా పథకం క్రింద 90 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే అంజయ్య మాట్లాడుతూ.. పేద మైనారిటీ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మైనారిటీ మహిళల కోసం మైనారిటీ ఫై నాన్స్ కార్పొరేషన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. మైనారిటీ నిరుద్యోగ మహిళల కోసం ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టు పేర్కోన్నారు. ఈ పథకం కింద మైనారిటీ నిరుద్యోగ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. దీని వల్ల ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు లబ్ది చేకూరనుందని తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారనీ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 2000 కుట్టు మిషన్లను క్రిస్టియన్ మైనారిటీల కోసం రిజర్వు చేసినట్లు చైర్మన్ ఇంతియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, చైర్మన్ నరేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, రామకృష్ణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin