Friday, 31 July 2026 11:37:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బాదుడే బాదుడు కార్యక్రమంలో బికే పార్థసారథి...

Date : 24 October 2022 01:46 AM Views : 609

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ నియోజకవర్గం నగర పంచాయతీ , ఇస్లాపురం, వెంకట రెడ్డిపల్లి, తిమ్మాపురం,లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గం ఇంచార్జ్ బికె. పార్థసారథి, అనంతరం ఇస్లాపురం, వెంకట రెడ్డిపల్లిలో పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసకర పరిపాలన...! ◆ వైసీపీ పరిపాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు . ◆ చెత్త పన్ను దగ్గర నుండి విద్యుత్, ఆర్టీసీ, ఇంటి పన్నుల పెంపు. ◆ వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మకాలు . ◆ రాష్ట్రంలోజగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో విధ్వంసకర పరిపాలనకొనసాగుతోందని, ప్రతిపక్ష పార్టీల నాయకులే లక్ష్యంగాదాడులు,దౌర్జన్యాలు,హత్యాయత్నాలు,పోలీసు కేసులతోఅణిచివేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ◆రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలు కట్టడాలను కూల్చడమే వైసిపి ప్రభుత్వ పాలనని ఎద్దేవా చేశారు. నిత్యవసర వస్తువులను విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. విద్యుత్, బస్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు దోచుకో దాచుకో అన్న చందాన రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. వైసిపి అధికారం చేపట్టిన అనంతరం రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని రోడ్లలో గుంతలు పూడ్చలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన త్రీవ స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అని రాష్ట్రం తెలుగుదేశం తోనే అభివృద్ధి చెందిందని అని అన్నారు. బటన్ నొక్కడం పాలనగా జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్న, చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని, వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు తోడ్పడాలని ఆయన కోరారు. స్థానిక ఎమ్మెల్యే శంకర నారాయణ నియోజకవర్గం అభివృద్ధి విస్మరించి తమ్ముళ్ల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాడని ఆయన విమర్శించారు. ◆ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులు,మండల కన్వీనర్ లు , మాజీ ఎంపీపీలు,మాజీ జడ్పిటిసిలు, కౌన్సిలర్లు,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలో మాజీ వార్డ్ మెంబర్లు, గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: