Saturday, 01 August 2026 01:38:06 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బాల్కొండ నియోజకవర్గంలో త్వరలో పర్మినెంట్ ఆర్టీవో ఎక్స్ టెన్షన్ ఆఫీస్...

Date : 29 July 2023 11:50 PM Views : 426

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : వేల్పూర్ : బాల్కొండ నియోజకవర్గ యువతి యువకుల కోసం ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మార్కెట్ కమిటి ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్లాట్ బుకింగ్,లెర్నింగ్ లైసెన్స్ అందజేసే ఆర్టీవో ఎక్సటెన్షన్ ఆఫీస్ సెంటర్ ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్లు,స్లాట్ బుకింగ్ సిస్టమ్,లైసెన్స్ జారీ చేసే ప్రక్రియను పరిశీలించారు. అందుకు సంబంధించిన వివరాలు అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా స్లాట్ బుకింగ్ కోసం వచ్చిన యువకులతో మంత్రి ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... బాల్కొండ నియోజకవర్గంలో త్వరలో పర్మినెంట్ ఆర్టీవో ఎక్సటెన్షన్ ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్మూర్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదని నియోజకవర్గంలోని దూర ప్రాంతాల మండలాలు ప్రజలకు అది అసౌకర్యంగా ఉన్నదని అన్నారు. అందుకే బిఆర్ఎస్ తరుపున సొంత ఖర్చులతో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోంచి ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కు యువత నుండి విశేష స్పందన వస్తోందని,ఇప్పటికే సుమారు 7వేల మంది యువకులు లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నారనీ తెలిపారు. ఆర్మూర్ ఆర్టీవో ఆఫీస్ వెళ్లే ఇబ్బందులు లేకుండా వేల్పూర్ లోనే ఎక్సటెన్షన్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నమన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి ఆర్టీవో ఎక్స్ టెన్షన్ కార్యాలయం కావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అడిగిన మూడు గంటల్లోనే దానికి సంబందించిన ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రవాణా శాఖ మంత్రికి నియోజకవర్గ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఆయా గ్రామాల వారీగా స్లాట్ బుకింగ్ షెడ్యూల్. అప్లై చేసుకున్న యువత ఓకే రోజు వచ్చి ఇబ్బందులు పడకుండా ఆయా గ్రామాల బిఆర్ఎస్ నాయకుల ద్వారా,సోషల్ మీడియా ద్వారా ఏరోజు ఏ ఏ గ్రామాల యువత రావాలో చెప్తామని దీంతో ఎవరికి అసౌకర్యం లేకుండా ఉంటుందన్నారు. ప్రతి రోజు 400 నుండి 500 వరకు స్లాట్ బుకింగ్ జరిగే అవకాశం ఉన్నందున అదే రోజు వారికి లెర్నింగ్ లైసెన్స్ జారీ చేసే అవకాశం కల్పించాలని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారికి మంత్రి సూచించారు. దీంతో దూర ప్రాంత గ్రామాల నుండి వచ్చే వారికి మళ్ళీ మళ్ళీ తిరగకుండా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. వేల్పూర్ లో ఎక్స్ టెన్షన్ ఆఫీస్ ఏర్పాటుకు రవాణా శాఖ అధికారులు వేగంగా స్పందించారని వారికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లైసెన్స్ లేదని పోలీసు చెకింగ్ లు తప్పించుకోవడానికి గల్లిలల్లో,రోడ్ మీద స్పీడ్ గా వెళ్లి యువత ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఇక నుండి తప్పుతుందని,దర్జాగా జేబులో లైసెన్స్ తో వెళ్ళొచ్చని చమత్కరించారు. నూతనంగా డ్రైవింగ్ లైసెన్స్ అందుకోబోయే యువతి యువకులకు ఈ సందర్భంగా మంత్రి వేముల శుభాకాంక్షలు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :