Friday, 31 July 2026 11:41:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భైరఖాన్ పల్లిలో 50 మంది ముస్లిం మహిళలు కాంగ్రెస్ పార్టీ నుండీ బీఆర్ఎస్ లో చేరిక...

Date : 22 July 2023 11:42 PM Views : 522

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కేశంపేట్ మండల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముస్లింల అభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నారని, రాష్ట్రంలో వారి అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారనీ షాద్ నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపెట మండలం భైరఖాన్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి 50మంది ముస్లిం మహిళలు తదితరులు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ నేతృత్వంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మెరుగైన విద్యావకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. అదేవిధంగా మైనార్టీలకు షాదీ ముబారక్, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, రంజాన్ తోఫా, ఇంకా అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ మైనార్టీలకు పెద్దపీట వేశామని తెలిపారు. అదేవిధంగా షాది ఖానాలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విధాల అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన కొనియాడారు. పార్టీలో చేరిన వారు వీరే :కేశంపేట మండలం బైర్ఖాన్ పల్లి గ్రామానికి చెందిన.. జులేఖ, ఇస్మాయిల్, చోటి, సాబేర బేగం, రేష్మ, షరీఫా, షబానా, రిజ్వాన, షాజహాన్, షబానా, షహనాస్, నూరాబి, వహిదా, ఆమీన, తబస్సుమ్, అంజు, జహీదా, షహన్య, నూర్జహాన్, ఖతీజ, నజీర్, జహంగీర్, సాదిక్, వహిదా, పాషా, జహీద్, తోఫిక్, యూసుఫ్, జహంగీర్, ముస్తఫా, అంజధ్, నవాజ్, వాజిద్, మహమ్మద్ హనీఫ్ సలార్, షకీల్, ఫరీద్, సాజిద్, బాజీద్, ఇక్బాల్, ఫాతిమా, నసిరిన్ బేగం, సమ్రీన్, బెహ్రూన్, తస్లిం, బిస్మిల్లా బేగం, సత్తార్, రషీదా బేగం, తాహెర్ పాషా, చాంద్ పాషా తదితరులు పార్టీలో చేరారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :