సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట న్యూస్: జిల్లాలో సంచలనం సృష్టించిన సూర్యాపేట రూరల్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మావోయిస్టు వడ్డే ఎల్లయ్య మృతదేహం జగ్గయ్య పేటలో లభ్యమైంది. పథకం ప్రకారం ఎల్లయ్యను హత్య చేసిన అనంతరం జగ్గయ్యపేట మండలం బండి పాలెం గ్రామ శివారులో దగ్గర మృతదేహాన్ని నిందితులు కాల్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మంటలు పెద్దగా వ్యాపించడంతో భయపడి ఆ మంటలను చల్లార్చి అక్కడే గుంత తీసి తవ్వి పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జగ్గయ్యపేట తాసిల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. నేరస్తులు నేరం తప్పించుకునేందుకు ఎల్లయ్య ను హత్య చేసిన అనంతరం చేపల లారీలో విశాఖపట్నం తరలించి సముద్రంలో పడేసినట్లు చెప్పిన విషయం తెలిసిందే.
-----------------------
Admin