Thursday, 30 July 2026 04:34:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టీం ఇండియా ఓటమి తట్టుకోలేక తిరుపతి లోఆగిన యువకుడి గుండె...

Date : 20 November 2023 11:30 AM Views : 256

సర్కార్ టీవీ న్యూస్ / తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లా రూరల్ మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ బీటెక్‌ పూర్తి చేశాడు. స్థానికంగా కంప్యూటర్‌ సెంటర్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను అతడు స్నేహితులతో కలిసి వీక్షిస్తున్నాడు. అయితే భారత్ బ్యాటింగ్ సమయంలో తీవ్ర నిరాశ చెందాడు. బౌలర్స్‌ మ్యాచ్ గెలిపిస్తారని ఆశపడ్డాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్ చేజారుతుండటంతో జ్యోతి కుమార్ తీవ్ర ఆందోళన చెందాడు. సాయంత్రం ఆరు గంటలకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాక.. త్వరగానే 3 ఆస్ట్రేలియా వికెట్లు పడటంతో.. ఇక మ్యాచ్ మనదే అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత మన బౌలర్లు వరుసగా పరుగులు ఇచ్చేస్తుంటే, జ్యోతి కుమార్ తీవ్ర ఆందోళన చెందాడు. ఆస్ట్రేలియా గెలుపు, ఇండియా ఓటమి తర్వాత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి అతను తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో జ్యోతి కుమార్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే తోటి స్నేహితులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కుమారుడి హఠాన్మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. త్వరలో వివాహం చేయాలనుకున్నామని, ఇంతలో తమ బిడ్డ చేజారిపోతాడని ఊహించలేకపోయాం అంటూ రోధించారు. వరల్డ్‌ కప్‌లో టీం ఇండియా మ్యాచ్ ఓటమి అతని ప్రాణాలపైకి తెచ్చింది. ఈ మ్యాచ్ అతను చూడకపోయి ఉంటే, బతికుండే వాడని తల్లిదండ్రులు విలపించారు. అనవసరంగా చూసి, ప్రాణం కోల్పోయినట్లైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తొలుత చెలరేగిన టీమ్ ఇండియా ఎన్నో ఆశలు పెట్టుకునే చేసింది. కానీ ఫైనల్‌ మ్యాచ్‌లో గట్టి పోటీ ఇవ్వకుండా బేజారుగా ఆడటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: