Friday, 31 July 2026 10:43:08 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పీసా చట్టాన్ని ఉల్లంఘించిన సీతారాంపురం ఇసుక క్వారీ అనుమతులు రద్దు చేయాలి...

Date : 18 June 2025 01:09 AM Views : 627

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు అధ్యక్షతనలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాలలో పీసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అధికారులు వెంకటాపురం (మం)సీతారాంపురం గ్రామం ఆలుబాక (జి) పీసా హెబిటేషన్ పరిధిలో ఉంది. కానీ అధికారులు పీసా చట్ట నిబంధనలు ఉల్లంఘించి వేరే పీసా అయినటువంటి బోధపురం గ్రామంలో పీసా గ్రామ సభను తప్పుగా నిర్వహించడం జరిగినది. పిసా నిబంధనలు పాటించలని ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ హైదరాబాద్ వారి ఆదేశాలు జారీ చేశారు. సీతారాంపురం గ్రామం ఆలుబాక (జి) పీసా హెబిటేషన్ పరిధిలోనికి వస్తుందని అన్నారు.కానీ అధికారులు పీసా నిబంధనలకు విరుద్ధంగా బోధపురం గ్రామంలో వేరే హెబీటేషన్ అయిన గ్రామంలో పీసా గ్రామ సభను నిర్వహించి జిల్లా పరిపాలన అధికారికి తప్పుడు నివేదిక పంపించడం జరిగినది. జాయింట్ సర్వేలో జియో కోవర్డ్ నెట్స్ కూడా తప్పుగా నివేదిక పెట్టి ఆలుబాక లో తీయాల్సిన ఇసుక ను వేరే పీసా హెబీటేషన్ అయిన బోధపురంలో ఇసుకను తీయడం అనేది పూర్తిగా పీసా చట్ట విరుద్ధమని అన్నారు. తప్పుడు పిసా గ్రామసభను నిర్వహించి తప్పుడు తీర్మానాన్ని ఉన్నత అధికారులకు నివేదిక పంపిన మండల ఎం.పీ.డీ.ఓ మరియు బోధపురం గ్రామపంచాయతీ సెక్రటరీ ను సస్పెండ్ చేయాలి.అలాగే సీతారాంపురం ఇసుక క్వారీ అనుమతులపై ములుగు జిల్లా కలెక్టర్ మరియు ఐ.టి.డి.ఏ పి.ఓ సమగ్ర విచారణ జరిపి వారి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు,ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, బొగ్గుల ప్రశాంత్, తాటి నాగరాజ్, సురిటీ సందీప్, రఘు, సంజయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :