సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందే బాబయ్య జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. బాబయ్య జన్మదిన వేడుకలు షాద్ నగర్ ఏబి కాంప్లెక్స్ వద్ద పెద్ద ఎత్తున నిర్వహించారు. కొండ విశ్వేశ్వర రెడ్డి, ప్రేమ్ రాజ్, జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, స్థానిక నేతలు డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర యువ నాయకుడు ఏపీ మిథున్ రెడ్డి తదితర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. పరిగి రోడ్డులో భారీ ర్యాలీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి పల్లి ర్యాలీని పరిగి రోడ్డులో జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ప్రారంభించారు. జన్మదిన వేడుకలకు రంగారెడ్డి జిల్లాలోని పలు నియోజక వర్గాల నుండి బిజెపి ముఖ్య నాయకులు హాజరయ్యారు.
-----------------------
Admin