సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కోత్తగూడెం లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగూడెం పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై పడింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు లారీని పక్కకు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-----------------------
Admin