సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, ఫారూఖ్ నగర్ మండల్ : రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు.. ఆదివారం ఫారూఖ్ నగర్ మండలంలోని అన్నారం, రామేశ్వరం, జంగోని గూడ సుమారు 300 వందల మంది బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార పార్టీ దాడులు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, ప్రశ్నించే వారిని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న మణిపూర్లో ఘోర పరిస్థితి నెలకొందని ఆడవారిపై అసభ్యంగా ప్రవర్తించడం దారుణమైన విషయమని అన్నారు. ఈ హింసాత్మక ఘటనను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం పై విసుగు చెందారని, కెసిఆర్ కల్లబొల్లి మాటలు నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కుటుంబాలు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫారూఖ్ నగర్ మండలాధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, బాబర్ ఖాన్, బాలరాజు గౌడ్, రఘు, లంకల రఘు గౌడ్, వెంకటేష్ గౌడ్, రాములు యాదవ్, అంజయ్య యాదవ్, మహేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, టీ రవి, శ్రీశైలం గౌడ్ తదితరులున్నారు.
-----------------------
Admin