సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలం డిసెంబర్ 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం పర్యటన పురస్కరించుకొని బూర్గంపహడ్ మండల పరిధిలోని సారపాక బిపిఎల్ స్కూల్లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ పనులను సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం వాయుసేన సిబ్బంది హెలికాప్టర్ ట్రయల్ నిర్వహించారని ట్రయల్ రన్ నిర్వహణలో చేసిన సలహాలు , సూచనలను ప్రకారం మంగళవారం వరకు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మైదానం ఆసాంతం వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేయాలన్నారు. హెలికాప్టర్ ల్యాండ్ సమయంలో దుమ్ము లేవకుండా మైదానాన్ని నీటితో తడపాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ డాక్టర్ వినీత్ , అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , ఆర్ అండ్ బి ఈఈ భీమ్లా అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేవాలయం , వీరభద్ర ఫంక్షన్ హాలులో ఏర్పాట్లును పరిశీలించారు.
-----------------------
Admin