సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : సర్కార్ న్యూస్ గత నాలుగు రోజుల క్రితం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది... బీసీ రిజర్వేషన్ 42% అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది... స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లో భాగంగా ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్ ఎస్టీ మహిళ రావడం ఓర్చుకోలేని కొందరు ప్రతి పక్ష నాయకులు సీతక్క గారిని బద్నాం చేస్తున్నారు... ఎస్టీ మహిళ రిజర్వేషన్ ములుగు జిల్లాకు రావడంలో సీతక్క పాత్ర ఉందని, సూత్రధారి అని కావాలని విమర్శిస్తున్నారు... స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ విషయంలో సీతక్క గారి ప్రమేయమే లేదు... అధికారులే జనాభా దామాషా ప్రకారం రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ ఖరారు చేశారు... కానీ కొందరు ఓర్వలేని బి.ఆర్.ఎస్. నాయకులు సీతక్క మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు మాట్లాడేటపుడు నిజ, నిజాలు తెలుసుకుని మాట్లాడాలి అని వారిని హెచ్చరించారు... తాడ్వాయి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి గారు పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ విషయంలో మంత్రి సీతక్క గారి ప్రమేయం లేదని, అధికారులు తమ నియమ, నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు ప్రకటించారని, ముఖ్యంగా రాష్ట్రం అంతటా బీసీలకు రాజకీయ పదవులు దక్కాలని 42% రిజర్వేషన్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని, బీసీలకు 42% రిజర్వేషన్ నచ్చని ప్రతిపక్ష నాయకులు కావాలని సీతక్క గారిని జెడ్పీ చైర్మన్ విషయంలో కావాలని బద్నాం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భముగా రేగ కళ్యాణి మాట్లాడుతూ గత సంవత్సరంన్నర కాలం నుండి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ విషయంలో అందరికీ సమాన వాటా దక్కాలని, బీసీలకు రాజకీయ పదవులు దక్కాలని, రాజకీయంగా ఎదగాలని రాజకీయ రిజర్వేషన్ విషయంలో 42% ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పదవులకు రిజర్వేషన్ ఖరారు అయింది. అందులో భాగంగా ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్ రొటేషన్ పద్ధతిలో వచ్చింది అని, అంతేకాని సీతక్క గారి ప్రమేయం లేదని, అధికారులు తమకు వచ్చిన నియమ, నిబంధనల ప్రకారం రొటేషన్ పద్ధతిలో వచ్చింది అని అన్నారు. అంతేకాని సీతక్క గారు ఒక కులానికో, వర్గానికో మద్దతు ఇచ్చే నాయకురాలు కాదని, కావాలని కొందరు ప్రతిపక్ష నాయకులు సీతక్క గారిని లక్ష్యంగా చేసుకొని ప్రతి చిన్న విషయానికి బద్నాం చేస్తున్నారని అన్నారు. గతంలో ములుగులో మార్కెట్ కమిటి చైర్మన్ జనరల్ ఉన్నప్పుడు కావాలని పీసా చట్టం ప్రకారం ఎస్టీ చేసింది బి.ఆర్.ఎస్.పార్టీ అని అన్నారు. ఎస్టీ అయిన మార్కెట్ కమిటీని మార్చాలని ఎంతో ప్రయత్నించారని అన్నారు. ఇప్పుడు కావాలని ఎస్టీ రిజర్వేషన్ చేసింది అని మాట్లాడే ప్రతిపక్ష నాయకులు నిజ, నిజాలు కూడా తెలుసుకోవాలి అని అన్నారు. సీతక్క గారు ప్రజా నాయకురాలు, ఏ ఒక్కరిని కూడా బాధించే వ్యక్తి కాదని, ప్రజలందరూ తనవాల్లె అని అనుకునే మహా నాయకురాలు అని, రాజకీయంగా ఎదగాలని ప్రతి ఒక్క విషయాన్ని సీతక్క గారిపై రుద్దుతూ అసత్య ప్రచారాలు చేస్తూ శునకానందం పొందుతున్నారని అన్నారు. ఇంకోసారి సీతక్క గారిని నిజ, నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.
-----------------------
Reporter