Thursday, 30 July 2026 03:27:32 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కే.సీ.ఆర్ పాలనలోనే మధిర పట్టణ అభివృద్ధి.... -జడ్పి చైర్మన్

Date : 26 January 2023 02:01 AM Views : 707

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : మధిర పట్టణం కే.సీ.ఆర్ పాలనలోనే మధిర పట్టణ అభివృద్ధి...... - జడ్పి చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే మధిర పట్టణ అభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్మన్, బీ. ఆర్. ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. బుధవారం నాడు మధిర పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గుడ్ మార్నింగ్ మధిర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అందులో భాగంగా 1, 2, 8, 19 వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, వార్డు కౌన్సిలర్లతో కలసి మార్నింగ్ వాక్ చేస్తూ వార్డులు మొత్తం కలియ తిరిగారు. ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటుగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మధిర మున్సిపల్ అభివృద్ధి కోసం రూ. 30 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజలంతా మద్దతుగా ఉండాలని కోరారు ప్రజలందరి సహకారంతో మధిర పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని గుడ్ మార్నింగ్ మధిర కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రజలకు ఉపయోగపడే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం సహా ట్యాంక్ బండ్, 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణంలో పలు చోట్ల పార్కులు ఏర్పాటు చేసుకున్నామని, సెంట్రల్ డివైడర్ తో పాటుగా లైటింగ్ సహా అంబేద్కర్ సెంటర్ ను సుందరికరణ చేశామని గుర్తు చేశారు. అలాగే పట్టణంలో ఉన్న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ను కూడా సుందరికరణతో తీర్చిదిద్దామని తెలిపారు. ఎన్నికల సమయం రాగానే వచ్చి మాయ మాటలు చెప్పే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి కేసీఆర్ కి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కావున మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇంత పెద్ద ఎత్తున నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి, పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :