సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్లోని కాంతి హైస్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు తామే స్వయంగా తయారు చేసిన వంటలను స్టాల్స్ లో ప్రదర్శించి విక్రయించారు. ఇట్టి కార్యక్రమంలో కాంతి హై స్కూల్ కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ, అమ్మ చేతి వంట యొక్క ప్రాముఖ్యతను, వంటగదిలో అమ్మ పడే కష్టాన్ని పిల్లలకు తెలియజేసేవిధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అలాగే వ్యాపార విలువలు మరియు లాభానష్టాల బేరీజు గురించి పిల్లలకు ఈ వయసులోనే అవగాహన వచ్చేటట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించి, విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వందకు పైగా జట్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కాంతి హై స్కూల్ కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి తెలిపారు...
-----------------------
Admin