Friday, 31 July 2026 12:54:54 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖమ్మం 6వ డివిజన్ లో వాడవాడ పువ్వాడ కార్యక్రమం...

Date : 24 January 2023 01:48 AM Views : 718

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వాడవాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలోని 6వ డివిజన్ నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ఉదయాన్నే పర్యటించారు. ప్రజలు హారతులతో డివిజన్ లోకి స్వాగతం పలికారు. తమ సమస్యలు విన్నవించెందుకు డివిజన్ ప్రజలు మంత్రి పువ్వాడ కొరకు ఎదురు చూసి తమ బాధలు, స్థానిక ఇబ్బందులు చెప్పుకుంటే తీరిపోతాయి ధీమాగా తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ డివిజన్ లోని ఇంటింటికి నేరుగా వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అత్యధిక సంఖ్యలో స్ధానిక ప్రజలు తమకు రోడ్లు, సైడ్ డ్రెయిన్లు కావాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, రాత్రి సమయాల్లో ఇంటికి వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడం కాకుండా వీధి దీపాలు కూడా వెలగట్లేదు అని, మరి కొన్ని చోట్ల అసలు దీపాలే లేవని వివరించారు. స్ధానిక చర్చ్ వద్ద కాల్వ నీరు రోడ్డు పైకి వస్తుందని ప్రజల ఫిర్యాదు మేరకు తక్షణమే ఇక్కడ కల్వర్టు నిర్మాణంకై ప్రతిపాదనలు చేసి నిర్మించాలని ఆదేశించారు. తక్షణమే వీధి దీపాలు ఏర్పాటు చేసి దీపాలు లేని చోట దీపాలు ఏర్పాటు చేయలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, గుంతల పూడిక, వృద్ధుల పెన్షన్లు, డ్రెయిన్లు తదితర సమస్యల పరిష్కారించలని మంత్రి పువ్వాడ ఆదేశించారు. అర్హులై ఉండి, చిన్న చిన్న సమస్యలు ఉండి ఆసరా పెన్షన్ పొందలేని వారికి తగు సూచనలు చేసి వారికి పెన్షన్ వచ్చేలా చేయలని మంత్రి అదేశించారు. ప్రభుత్వం ఎంతో చిత్త శుద్ధితో పేదలకు ఆసరాగా ఉండేందుకు ఆసరా పెన్షన్ ను ఇస్తుంటే ఆయా ఫలాలను అధికారులు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తొలుత డివిజన్ లో ప్రధాన డ్రెయిన్ల అవసరతను గుర్తించి వాటికి ప్రతిపాదనలు సిద్దం చేయలని, శిధిలమైన కొన్ని చోట్ల సైడ్ కాల్వల మరమ్మతులు చేపట్టాలని, అవసరం అయ్యే చోట కొత్త సైడ్ కాల్వలకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ నాగండ్ల కొటి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, విద్యుత్ డిఇ రమేష్, మున్సిపల్ డీఈలు, ఏఈలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :