సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా యువజన మరియు క్రీడా అధికారి ఆధ్వర్యంలో మే ఒకటవ తేదీ నుంచి వివిధ క్రీడా విభాగాల్లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో జిల్లాలో మొట్టమొదటిసారిగా టేబుల్ టెన్నిస్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ శిబిరానికి మంచి స్పందన లభించింది పాల్వంచలో జరుగుతున్న ఈ శిబిరానికి సుమారు 40 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటారని శిక్షకుడు గయాసుద్దీన్ (రియాజ్ ) తెలియజేశారు గురువారం రాత్రి ఈ శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు కాసేపు సరదాగా వారితో టేబుల్ టెన్నిస్ ఆడి ప్రోత్సాహపరిచారు అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ మీకు నచ్చిన క్రీడలో మీరు శిక్షణ పొందడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మీరు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు క్రీడల్లో పాల్గొనడం వల్ల జీవితంలో ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం అలవాటు అవుతుందని క్రమశిక్షణతో ఉండడం వల్ల జీవితంలో స్థిరపడటం జరుగుతుందని అన్నారు క్రీడలకు క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించడంలో ఎంత మాత్రం వెనక్కి తగ్గేది లేదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడా అధికారి పరంధామ రెడ్డి గారు, లక్ష్మణ్, సీనియర్ క్రీడాకారులు బట్టు ప్రేమ్ కుమార్ వ్యామాయ ఉపాధ్యాయులు శ్యామ్, రవికుమార్ తల్లిదండ్రులు పాల్గొన్నారు... సర్కార్ టీవీ ప్రతినిధి షేక్ ఆసిఫ్
-----------------------
Reporter