సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు మండలం సజ్జపురం గ్రామంలో ముదిరాజ్ కుటుంబానికి చెందిన భీమన సైదులు ముదిరాజ్ గత వారం రోజుల క్రితం అనారోగ్యం తో చనిపోవడం జరిగింది వారి కుటుంబ సభ్యుల కి రఘు చేయూత ద్వార ఐదు వేలు రూపాయలు ఓజో ఫౌండేషన్ ఇంచార్జీ కుక్కల వెంకన్న వారి కుమారుడు భీమన అభిలాష్ కి అందించారు.నిరుపేద కుటుంబాలకు రఘు చేయూత ద్వారా అందిస్తున్న సేవలు తెలుసుకున్న గ్రామస్తులు ఓజో ఫౌండేషన్ సభ్యులు ద్వారా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న కు తెలియజేయగా వారు ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు కు తెలియజేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబనికి ఓజో ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేసారు.ఈ సందర్భంగా కుక్కల వెంకన్న మాట్లాడుతు ఈ నియోజకవర్గంలో రఘు చేయుతా ద్వారా ఎస్ సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలలోని పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నము ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని వందల కుటుంబాలకు వివిధ కార్యక్రమాలకు ఆర్ధిక సాయం చేశామని, సజ్జపురం గ్రామంలో ఎన్నో నిరుపేద కుటుంబలకు రఘు సాయం చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమనికి సాయం చేయడం, అదేవిధంగా వినాయక విగ్రలు, అమ్మవారి విగ్రహాలూ వివ్వడం గాని, ఎన్నో నిరుపేద కుటుంబాలకు రఘు చేయూత ద్వార ఆర్ధిక సాయం చేయడం గానీ బతుకమ్మ పండుగ సందర్భంగా బహుమతులు వివ్వడం క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడా సమగ్రీని వివ్వడం గాని డ్రామా ఆర్థిక సాయం చేయడం గాని ఇలా చెప్పుకుంటూ పోతే హుజూర్ నగర్ నియోజకర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో చాలా కార్యక్రమాలు చేశామని, రఘు అన్న లాంటి మంచి వ్యక్తికి మీరు అందరూ కూడా తోడుగా ఉండాలని రాబోయే రోజులలో అన్నకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగరాజు, దనమూర్తి,నర్సయ్య, బొమ్మకంటి సైదులు ముదిరాజ్, చంద్ర శేఖర్ నాయక్,గ్రామపెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin