సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక పట్టణంలోని తాళ్ల గోమ్మూరు గ్రామంలోని రైతు వేదిక నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగాకాంతారావు మంగళవారం నాడు BRTU జిల్లా అధ్యక్షులు సానికొమ్ము శంకర్ రెడ్డి ఇటీవల కార్మిక శాఖ తరపున ప్రతిష్టమైన శ్రమశక్తి అవార్డు అందుకున్న సందర్భంగా వారి సన్మాన కార్యక్రమాల్లో పాల్గొని BRS పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ సీనియర్ నాయకులు యువజన విభాగం నాయకులతో కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి జిల్లా పార్టీ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రమ శక్తి అవార్డు అవార్డు గ్రహీత సాని కొమ్ము శంకర్ రెడ్డి జిల్లా పార్టీ తరపున అదే విధంగా నియోజకవర్గం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు, వారి సేవలను గుర్తించి చిన్న వయసులోని శ్రమ శక్తి అవార్డు రావడం అభినందనీయమని అన్నారు, యూనియన్ అభివృద్ధి తో పాటుగా,పార్టీ అబిరుదిలో కార్మికులకు సేవా చేసి వారి సమస్యల కొరకు నిరంతర పోరాటం చేసినందుకు వారికీ ఈ అవార్డు రావటం జరిగిది ఆయన అన్నారు, పూర్తిస్థాయిలో కార్మికులకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చిన వారు కష్టాల్లో తోడుగా ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు, ఈసారి జరిగే ఐటీసీ ఎన్నికలలో BRTU గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు BRS పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు నాయకులందరూ పనిచేయాలని అన్నారు,
-----------------------
Admin