సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : రక్షబంధన్ రాఖీ పండుగను పురస్కరించుకుని సఖీ ఉమెన్ ప్రొటెక్షన్, వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సఖీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం డియస్పి షేక్ అబ్దుల్ రహమాన్ కు రాఖీ కట్టారు. డియస్పి ఆఫిస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ బోర్ర జయమ్మ ఆధ్వర్యంలో డియస్పి రహమాన్ కు, కార్యలయ సిబ్బంది కి రాఖీ కట్టారు. పోలీస్ అధికారులు మహిళాలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉండి తోబుట్టువుల్లాగా మహిళాలకు రక్షణ కల్పిసున్నరని బోర్ర జయమ్మ తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా డియస్పి రెహమాన్ కు రాఖీ కట్టడం ఆనందం గా ఉందని సఖీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సఖీ ఉమెన్ ప్రొటెక్షన్, వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జోగు కళ్యాణి, జిల్లా కోఆర్డినేటర్ బోర్ర జయమ్మ, జిల్లా కమిటీ సభ్యులు సరిత, కొత్తగూడెం పట్టణ కమిటీ సభ్యులు రమాదేవి పాసి, హైందవి, స్వప్న, సఖీ జిల్లా కార్యలయం కోఆర్డినేటర్ చింతల స్పందన తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin