సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని స్థానిక మంచి కంటి భవన్లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికై జూలై 13న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 3,500 కోట్ల రూపాయలు పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయనీ, కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో విచ్చలవిడి ఫీజుల వసూళ్లు అరికట్టుటకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని,సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని,మన ఊరు- మన బడి పథకంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ చేర్చి అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఉన్నత విద్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని,యూనివర్సిటీలకు సరిపడా నిధులు కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి కేటాయింపులు పెంచాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న పాఠ్యపుస్తకాలు, యూనిఫారం వెంటనే అందించాలని,బీసీ సంక్షేమ హాస్టల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఆన్లైన్ పద్ధతిని రద్దు చేయాలని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగానికి సరిపడా నిధులు కేటాయించాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని,గోదావరి ముంపు ప్రాంత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేకుండా పోలవరం ఎగువనీటి వరద నుంచి రక్షణకు ఆనకట్ట నిర్మించాలని, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న తదితర విద్యారంగ సమస్యల పరిష్కారానికై బంధు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ,ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ కు సహకరించాలని, విద్య రంగ పరిరక్షణ కోసం సాగే పోరాటంలో తామూ భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్, జిల్లా ఉపాధ్యక్షులు అభిమన్యు, నవీన్, అభిమిత్ర నాగకృష్ణ,శైలజా ,హరీష్,అఖిల్ ,భవ్య,రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin