సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి కి సమీప బంధువూ చౌటపల్లి గ్రామానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బేత సైదిరెడ్డి గురువారం బక్క మంతుల గూడెం దగ్గర ఆటో ఢీకొట్టడంతో ప్రమాదానికి గురై హైదరాబాదు కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వారి మరణం దిగ్బ్రాంతి కి గురిచేసిందని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.వారి పార్థివ దేహానికి, పూలమాలవేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి ని తెలియజేశారు.వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి రవీందర్ నాయక్ ,బిఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వీరారెడ్డి , సీతారాం రెడ్డి, హుస్సేన్ రెడ్డి, ఐతగాని చిన్న శంబయ్య, ఎం నర్సిరెడ్డి, ఐతగాని మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin