సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు మాసాని కృష్ణారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి ఆదేశాలతో పిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డికి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం ఇచ్చిన డీజేఎఫ్ రాష్ట్ర నాయకులు యరమల కిషోర్ రెడ్డి ఈ సందర్భంగా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండ వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అలాగే ప్రవేట్ వైద్యశాలలో ఉచిత వైద్యం అందేలా చూడాలని ప్రవేట్ పాఠశాలల్లో అక్రిడేషన్ తో సంబంధం లేకుండా పాత్రికేయుల పిల్లలకు ఫీజులో రాయితీ ప్రభుత్వ భరించాలని వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు మరియు రైల్వే రవాణా సౌకర్యాలు కల్పించాలని మరియు ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలని పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించానని తెలిపారు వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి జర్నలిస్టులు సమస్యలపై పోరాడుతామని జర్నలిస్టు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అని తెలిపారు..
-----------------------
Admin