Thursday, 30 July 2026 09:30:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అకాల వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధితులకు కాంగ్రెస్ సాయం.

Date : 31 July 2023 06:39 AM Views : 428

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రకృతి ప్రకోపంతో విలవిలలాడిన పేద వర్గాలు గూడు చెదిరిపోయి గుండెలవిలసిపోయి సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ పెద్ద మనసుతో ఆదుకున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఇల్లు కూలి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర సరుకులను పంపిణీ చేసి తన మానవత్వం చాటుకున్నారు. నియోజక వర్గంలో నిరంతర ప్రక్రియగా సహాయ ఉద్యమం చేస్తున్న వీర్లపల్లి శంకర్ ఆదివారము చౌదరిగూడ మండలంలోని పీర్జాపూర్ గ్రామంలో అకాల వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధితులకు నూనె చంద్రమ్మ 5000వేల రూపాయలు మరియు నిత్యవసర సరుకులు అందజేశారు. ముళ్ళ బిక్కమ్మ 2500, కొందుర్గు గ్రామంలో జులేఖ బేగం ఇల్లు కూలిపోవడంతో 10000 వేల రూపాయలు మరియు నిత్యవసర సరుకులు అందజేశారు. కొందుర్గు గ్రామంలో మహమ్మద్ యునుస్ 5000 వేల రూపాయలు మరియు నిత్యవసర సరుకులు అందజేశారు. ఫరూక్ నగర్ మండలంలోని అయ్యవారి పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మరియు ఉప్పరిగడ్డ తండాలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, ఫరూక్ నగర్ మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, కొందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చౌదరిగుడా మండల అధ్యక్షుడు రాజు, బీసీ సెల్ అధ్యక్షుడు జాకారం శేఖర్, చించోడు మాజీ సర్పంచ్ అనంతం, ఫరూక్ నగర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, ఎస్సీ సెల్ నరేందర్, సత్యం రెడ్డి, ఎస్టీ సెల్ నాయకుడు శీను నాయక్, తుపాకుల శేఖర్, ఎలికట్ట ఎంపీటీసీ శ్రీశైలం, ఎంపీపీ తనయుడు ఆంజనేయులు, మల్లేష్ గౌడ్, డిప్పీ సర్పంచ్ సీతారాం, అశోక్, నవీన్, శ్రీధర్, ముబారక్, రామ స్వామి, రాజు, కిసాన్ కాంగ్రెస్ వెంకట నరసింహారెడ్డి, దస్తగిరి, శీను, మల్లేష్, శేఖర్, యాదయ్య, బుచ్చయ్య, యాదయ్య, లక్ష్మీ నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :