సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్లోని క్రాంతి హై స్కూల్ విద్యార్థినులు ఆర్మూర్ పిప్రి డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన రెండవ రాష్ట్ర స్థాయి రెడ్ టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలలో నిజాంబాద్ జిల్లాకు ప్రాతినిద్యం వహించిన కాంతి హై స్కూల్ విద్యార్థినిలు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇట్టి సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ కాంతి గంగారెడ్డి గారు కెప్టెన్ గీత, వైస్ కెప్టెన్ బిందు, అంజలి , గారు శివాని, మేఘన ,శ్రీనిధి ,గంగోత్రి, ఆమెదా, ఆశ్రిత ,స్వాతిక ,అనన్య లను అభినందించారు. రాష్ట్ర సాయి లో కాంతి హై స్కూల్ విద్యార్థినులు ప్రతిభ చాటడం సంతోషకరం అని తెలిపారు. వారికి బహుమతులు అందజేసిన పి.ఈ. టి అన్వేష్ ను అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి గారు , డైరెక్టర్ శశాంక్ గారు, పి ఈ టి అన్వేష్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Admin