సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెల్లోడిమీద తిరుగుబాటు చేసి దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కోండ కోటనే ఏలిన ధీరుడిగా చరిత్రకెక్కిన ఒక బహుజన వీరుడిగాథ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర అందరికీ ఆదర్శమని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాజా మైనొద్దిన్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా పాపన్న గౌడ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుజనులకే రాజ్యాధికారం దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఎందరో మహనీయుల జీవితాలు మనకు ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదని, భావితరాలకు పోరాట స్పూర్తినిచ్చే వారి జీవితాలు చరిత్ర పుటల్లో ఘన కీర్తిని సొంతం చేసుకున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin