సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత హోమ ద్రవ్యాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ వివేకానంద పాఠశాలలో సాయంత్రం జరిగిన ఉచిత హోమ ద్రవ్యాల పంపిణీ కార్యక్రమాన్ని కొత్తగూడెం గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కెవి రంగా కిరణ్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్కే చారిటబుల్ సర్వీస్ సొసైటీ ద్వారా కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి ,సుజాతనగర్, మండలాల్లోని గణేష్ నవరాత్రి మండపాల వద్దకే వెళ్లి ఉచిత హోమ ద్రవ్యాలను,2 ధ్వజలను, విశ్వహిందూ పరిషత్ బ్యానర్ను ఉచితంగా అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు కంచర్ల చంద్రశేఖర్, వందనపు శ్రీధర్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ధారా రమేష్,, ఆకుల నాగేశ్వరరావు గౌడ్, ఆర్ఎస్ఎస్ కార్యవాహ చేవూరి రామచంద్ర రావు, VHP ఎం వి కె శర్మ, విజయలక్ష్మి, జల్లారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin