Thursday, 30 July 2026 11:55:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డ్రగ్స్, మరియు సైబర్ నేరాలపై అవగాహన...

Date : 15 October 2024 09:53 AM Views : 683

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు కోదాడ డీస్పీ శ్రీధర్ రెడ్డి,రూరల్ సీఐ రజితా రెడ్డి , కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం లో సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఎస్ ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై , సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,ఎటిఎం కార్డ్ వివరాలు,ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.సైబర్ మోసాలపై1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతివేగం ప్రయాణించవద్దు అని వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డీపీ లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు.అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం నందు కానిస్టేబుళ్ సురేష్, హోం గార్డ్ శ్రీకాంత్, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, గురులింగం, క్రిష్ణ,చారి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: