సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేటలోని డఫోడిల్స్ హైస్కూల్ కమిటీ హాల్ లో బీసీ సంక్షేమ సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బిసి కుల సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిసి కుల సంఘాల నాయకుల సమక్షంలో బిసి జెఏసి నియోజకవర్గ చైర్మన్ గా డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ లుగా కొల్లూరి లక్ష్మినారాయణ, కడారి సురేష్ యాదవ్, రామగోని సుధాకర్ గౌడ్, పెండ్యాల యాదగిరి, గాండ్లోజు సురేందర్, నర్సంపేట బిసి జెఏసి కో కన్వీనర్ లుగా చిలువేరు కొమ్మాలు, కందికొండ కుమారస్వామి, గట్ల నాగేశ్వరరావు, ఓర్సు సాంబయ్య, కక్కుర్త్ రమేష్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర బిసి జెఏసి 42 శాతం రిజర్వేషన్లు అమలుపరచాలని తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపుకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్ టి సి బస్సులు, వ్యాపార సంస్థలు,ప్రభుత్వ మరియు ప్రైవేటు ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలు, పాఠశాలలు అదేవిధంగా ఆటో కార్మికులు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తూ బంద్ లో పాల్గొంటామని తెలపడం జరిగిందని తెలిపారు. ఈ బంద్ కు పోలీసు డిపార్టుమెంటు సహకరించాలని బిసి జెఏసి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతల నరేందర్, బీసీ సంఘం నాయకులు మేడిశెట్టి శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, రామగిరి వీరేందర్, ఓదెల సురేష్ లతో పాటు బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
-----------------------
Reporter