సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓ.డి.చెరువు మండలములోని వెంకటాపురము, మిట్టపల్లి గ్రామ సచివాలయాలను ఎంపీడీఓ కే.వరలక్ష్మి బుధవారం సందర్శించారు. సమావేశం ఏర్పాటు చేసి జగనన్న సురక్ష కార్యక్రమము పై సచివాలయ సిబ్బందికి, వాలంటిర్లు కు తగు సూచనలు అందించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ జగనన్న సురక్షలో భాగంగా ఎవరినైనా సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తిస్తే వారికి ఆగస్టు 1నుంచి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు లబ్ది పొందని వారికి ఇంటివద్దకే వెళ్లి ప్రశ్నలు అడిగి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేదే జగనన్న సురక్షతని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ పూల రెడ్డెప్ప, సచివాలయ సిబ్బంది, వాలాంటీర్లు పాల్గొన్నారు.
-----------------------
Admin