Thursday, 30 July 2026 11:24:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఈ.డబ్ల్యూ.ఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్థించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం... - కేసన శంకరరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమసంఘం రాష్ట్రఅధ్యక్షు

Date : 30 November 2022 12:11 AM Views : 594

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి సాయి ఆరామoలో, రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేసారు. ఓటు బ్యాంక్ అధికంగా వున్న బీసీలు ఐకమత్యంతో ముందుకు సాగాలని ఏపీ బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా కేసన శంకర్ రావు మాట్లాడుతూ...ఆర్థికంగా బలహీన వర్గాలు అనే పేరుతో ఆధిపత్య కులాలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించిన 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. పార్లమెంటులో 50% బీసీలకు సీట్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. దీనికి సహకరించిన ప్రతి పార్టీకి బీసీ సంఘం అనేది తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మండల కమిషన్ సిఫారసు మేరకు కుల జనగణన చేయాలని రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ కోరారు. రాబోయే రోజుల్లో కొత్త జిల్లాల్లో పార్టీలకు అతీతంగా నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో బీసీలు ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్లాలని వారు పిలుపునిచ్చారు. ఈ.డబ్ల్యూ.ఎస్ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్ధించడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని సూచించారు. కావున ఇచ్చిన తీర్పును పునఃపరిశీలన చేయాలని ఏపీ బీసీ సంక్షేమసంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు వాల్మీకి హరి, సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నామాల శంకర, బీసీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సంపంగి గోవర్ధన్ , పుట్టపర్తి బిసి సీనియర్ నాయకుడు PC.గంగన్న , రాష్ట్ర కార్యదర్శి లింగమయ్య , ప్రధాన కార్యదర్శి ఎస్.ఆర్.నాగభూషణం , స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పాల రాజ్ కిరణ్ , B.C.S.F రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణ్ కుమార్ గౌడ్, సాయి రాజ్ , తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: