Thursday, 30 July 2026 03:27:27 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం

Date : 07 October 2025 10:33 PM Views : 191

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత & నర్సంపేట అభివృద్ధి ప్రదాత, మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం 1వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం గా ఆధ్వర్యంలో 1వ వార్డు లోని ప్రతి ఇంటికి & ప్రతి గడపకు వెళుతూ కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ & కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది.. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు అడగడానికి వస్తే..కాంగ్రెస్ బాకీ కార్డు చూయించి..100 రోజుల్లో నెరవేరుస్తా అన్న హామీలు ఏమయ్యాయి అని నిలదీసి అడగండి అని కోరడం జరిగింది.. కావున ప్రజలు తిరిగి బదులిస్తూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మాయమాటలను నమ్మి & మేము మోసపోయి ఓట్లు వేసినందుకు,మాకు తగిన శాస్త్రి జరిగిందంటూ వారు వాపోవడం జరిగింది.. ఈ సందర్భంగా 1వ వార్డ్ మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హయాంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని అన్నారు.. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చానికుండా.. కాలయాపన & చేస్తూ ప్రజలను నరకయాతనకు గురి చేస్తున్నారని అన్నారు.. ఇప్పటివరకు ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వని అసమర్ధత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.. 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు నెలకు 2500 పెన్షన్ ఇస్తామని..- వృద్ధులకు కేసీఆర్ 2000 రూపాయలు పెన్షను మాత్రమే ఇస్తున్నాడు ..మేము 4000 రూపాయలు ఇస్తామని.. దివ్యాంగులకు 3,000 పెన్షన్..6000 రూపాయలు ఇస్తామని.. కళ్యాణ లక్ష్మి కింద కేసీఆర్ 1 లక్ష రూపాయల మాత్రమే ఇస్తున్నాడు అని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1లక్ష తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని అన్నారు..ఇప్పటివరకు లక్ష తో పాటు తులం బంగారం ఎంతమందికి ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేయాలని అన్నారు.. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని..2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామని..సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని..నిరుద్యోగులకు,విద్యార్థులకు,రైతులకు అనేక హామీలు ఇచ్చి..కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని.. కావున ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చని కాంగ్రెస్ పార్టీకి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు.. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సీ సెల్ కోశాధికారి ఎర్ణం మధు,1వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు కందకట్ల సతీష్, మానుక గణేష్, మోట్ల రఘు, ఎర్ర శ్రీకాంత్, పవన్ ,రాకేష్,నర్సంపేట పట్టణ బిఆర్ఎస్వి అధ్యక్షలు దేవోజు హేమంత్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :