సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని వాగ్దేవి హై స్కూల్ వారి సక్సెస్ కోచింగ్ సెంటర్ నందు ఇటీవల ప్రకటించిన నవోదయ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. వారిలో నిమ్మల కోటి హరిహరన్, గుండు సాయి రిషిక్, ఇంజమూరి యువంతులు నవోదయ ఫలితాల్లో సీటు సాధించారు. ఈ విద్యార్థుల్ని కరస్పాండెంట్ జాల జ్యోతి బాబు ప్రిన్సిపాల్ నిడిగొండ గంగాధర్ లు ఘనంగా సన్మానించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలకు నవోదయ సీటు సాధించడం కోసం విశేష కృషి చేసిన సక్సెస్ సెంటర్ వారి అధినేత గంగాధర్ ని సన్మానించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గంగాధర్, జ్యోతి బాబు మాట్లాడుతూ మా సక్సెస్ సెంటర్లో సాధారణ విద్యార్థులని అసాధారణ విద్యార్థులుగా చేయడమే తమ ధ్యేయమని, సాధారణ ఫీజులతో కార్పోరేట్ విద్యను అందిస్తున్న ఏకైక విద్యాసంస్థ తమదని అన్నారు.
-----------------------
Admin