సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామానికి చెందిన ధర్మ సమాజ్ పార్టీ ఊట్కూరు మండల నాయకుని గా పనిచేస్తూ మల్లికార్జున్ గత పది రోజులుగా అనారోగ్యంగా బాధపడుతూ నిన్న రాత్రి మృతి చెందడం జరిగింది. అయితే (మాదిగ జాగృతి సంఘం) ఉట్కూరు మండల్ నాయకులు వేణు ధ్వర్యంలో మల్లికార్జున్ అంత్యక్రియలో పాల్గొని వారి కుటుంబానికి అన్ని విధాలుగా మాదిగ జాగృతి సంఘం తోడుగా ఉంటదని భరోసానిస్తూ వారి కుటుంబానికి ₹5000/- రూపాయల నగదును ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా నాయకులు కో కన్వీనర్ ఈశ్వర్, జిల్లా మీడియా కన్వీనర్ కర్నే బాల్ రాజ్, ఉట్కూరు మండల అధ్యక్షులు గోపాలకృష్ణ, కృష్ణ, సంజీవ్, మక్తల్ మండల నాయకులు గువ్వల శివరాజ్. జి రాజు, పి. విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin